/rtv/media/media_files/2025/07/24/pakistan-2025-07-24-18-03-41.jpg)
పాకిస్థాన్ ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకు రావడానికి పాక్ డ్రోన్లు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. అయితే, భారత సరిహద్దు భద్రతా దళాలు (BSF) అప్రమత్తంగా ఉండి, వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలను, మత్తు పదార్థాలను భారత్ లోకి పంపేందుకు పాక్ కుట్ర పన్నింది. అయితే అలెర్ట్ అయిన భారత సరిహద్దు దళం ఆరు డ్రోన్లను కుప్పకూల్చింది.
🚨 #BreakingNews 🚨 Punjab: Six Pakistani drones neutralised; three pistols, one kg heroin seized https://t.co/cJjGZSX1CN
— Instant News ™ (@InstaBharat) July 24, 2025
Get best #amazon#deals here: https://t.co/XSLcMcH5fl#TrendingNews#BigBreaking July 24, 2025 at 02:35PM
ఈ డ్రోన్లు సాధారణంగా డ్రగ్స్, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారత భూభాగంలోకి పంపించడానికి ఉపయోగించబడుతున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్లు మూడు తుపాకీలు, మేగజీన్లతోపాటు కేజీ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి, అమృత్‌సర్‌లోని మోధే గ్రామం సమీపంలో అనుమానాస్పద వస్తువులు భారత్ భూభాగంలోకి వస్తున్నట్లుగా బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వెంటనే అలెర్ట్ అయ్యారు.
మూడు తుపాకులు, మూడు మ్యాగజీన్‌లు
కౌంటర్ ఆపరేషన్ చేపట్టి మూడు తుపాకులు, మూడు మ్యాగజీన్‌లు, దాదాపు 1.07 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గురువారం తెల్లవారు జామున అట్టారీ దాల్ గ్రామానికి సమీపంలో మరో డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపారు. వీటితోపాటు దాల్ సమీపంలోని పంటపొలాల్లో తుపాకీ విడిభాగాలు, ఓ మ్యాగజీన్ గుర్తించినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. తరన్ జిల్లాలోని దాల్ గ్రామ సమీపంలోని వరి పొలం నుండి దళ సిబ్బంది పిస్టల్ భాగాలు, ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత సరిహద్దు దళాలు పాక్ సరిహద్దులో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయి. పాకిస్థాన్ నుండి వచ్చే ప్రతి ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Also Read : Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ వచ్చాడు.. కుంటుకుంటూ క్రీజులోకి - VIDEO