Ambati Rambabu: పేరు మార్చుకున్నా ముద్రగడ..ముద్రగడే!
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో మాజీ మంత్రి అంబటి సమావేశం అయ్యారు.
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో మాజీ మంత్రి అంబటి సమావేశం అయ్యారు.
కోనసీమ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తాటిపాక డైలీ మార్కెట్లో కాకులు ఐక్యతను చాటుకున్నాయి. మార్కెట్లో విసిగిస్తున్న ఓ కాకిని చికెన్ సెంటర్ యజమాని తాడుతో కట్టేశాడు. దీంతో వందలాది కాకులు అక్కడకు చేరుకుని ఒకటే గోల చేయడంతో కట్టేసిన కాకిని యజమాని వదిలేశాడు.
AP: నరసాపురం MPDO వెంకటరమణారావు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన ఏలూరు కాలవలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు తనని వేధించాడని నిన్న లేఖ రాసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీగా మారింది. సెలవులపై వెళ్ళిన ఎంపీడీఓ ఫోన్ ఏలురు కాలువలో దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా తునిలో జేజే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. జేజే ఆసుపత్రిలో అందించే సేవల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నదే తన కోరిక అన్నారు.
AP: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్రంలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని అన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ, అందుకు తాను ఒప్పుకోలేదని.. రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వద్ద ప్రధాన ద్వారం హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరాలో రికార్డ్ ఆయిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
తూర్పుగోదావరి జిల్లా వేమగిరి తోటలో ఓ టీడీపీ కార్యకర్త వర్షపు నీటిలో పొర్లు దండాలు పెడుతూ నిరసనకు దిగారు. డ్రైనేజీలు తీయాలంటూ అధికారులను వేడుకున్నారు. చిన్నపాటి వర్షం వస్తే డ్రైనేజీ అంతా కాలనీలో ఉండిపోతుందని దీని వలన రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.