AP : సైకిల్‌పై ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు.. ఇంతలోనే..! తూర్పుగోదావరి జిల్లా ఉండేశ్వరం గ్రామంలో బాలుడు రాంబాబు వరద నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఆడుకోవడానికి వెళ్ళిన రాంబాబు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి A Boy Missing Case In East Godavari District : తూర్పుగోదావరి (East Godavari) జిల్లా ఉండేశ్వరం గ్రామంలో ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు (Parents) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉండేశ్వరపురం గ్రామానికి చెందిన పిప్పళ్లు వెంకటపతి, పిప్పళ్ళు దుర్గ కుమారుడు రాంబాబు (Rambabu). నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుండి బయటకు ఆడుకోవడానికి వెళ్లాడు. అయితే, రాంబాబు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం వెతుకులాడారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్తిపాడు, బొబ్బిల్లంక గ్రామాల మధ్య తొర్రిగడ్డ కాల్వ కల్వర్ట్ వద్ద రాంబాబు సైకిల్ ను తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో ఆడుకోవడానికి వెళుతూ ఆ బాలుడు సైకిల్ పై కాలువలో పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు. రాత్ర చీకట్లో ఎంత శ్రమించిన లాభం లేకపోవడంతో ఉదయం నుంచి తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు పదవ తరగతి చదువుతున్నాడు. కుమారడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..! #east-godavari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి