BREAKING: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
AP: వైసీపీకి షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
AP: వైసీపీకి షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
AP: జగన్‌కు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు మరో నేత. గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈరోజు వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పవన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో కిలాడి లేడీలు దర్జాగా చీరలు దోచుకుపోయారు. వేర్వేరు ప్రాంతాలలో వరుసగా రెండు షాపులలో లక్షల విలువచేసే పట్టు చీరలు దోచేశారు. చీర ఒపెన్ చేసి కెమెరాలకు అడ్డుగా పెట్టి వాటి కింద ఉన్న చీరలను దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
కాకినాడ జిల్లా ముసలయ్యపేట సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అమరవిల్లిలో నివాసముంటున్న లలితకు 20 రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి ఫిక్స్ చేయడం వల్లే లలిత వెళ్లిపోయినట్లు సమాచారం.
AP: జగన్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే తన రాజీనామాపై అనుచరులకు ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో దొరబాబు జనసేనలో చేరనున్నట్లు సమాచారం.
రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్తామని కలెక్టర్ల సమావేశంలో జనసేనాని తెలిపారు. స్కిల్ సెన్సెస్కు అధికారుల సలహాలు, సూచనలు ఎంతో అవసరమన్నారు.
కాకినాడ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి పత్రం అందించారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టానురీతిలో దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోట్ చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
కాకినాడలో అక్రమంగా విక్రయిస్తున్న మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తెచ్చిన మత్తు మాత్రలు, గంజాయి, దగ్గుమందును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. కాకినాడకు చెందిన ఇద్దరు గుట్టుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.