CM Chandrababu : నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన AP: నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన అనంతరం హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం కానున్నారు. By V.J Reddy 23 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Konaseema District : ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు (Chandrababu). కొత్తపేట మండలం వానపల్లిలో స్వర్ణ గ్రామపంచాయతీ గ్రామసభలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి తన నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయల్దేరనున్నారు. 11 గంటల 40 నిమిషాలకు అయినవిల్లి ఎలిఫెంట్ వద్దకు చేరుకుంటారు. అక్కడనుండి రోడ్డు మార్గంలో వానపల్లి చేరుకోనున్నారు సీఎం. స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామాలకు కావలసిన మౌలిక వసతులపై మాట్లాడనున్నారు. గ్రామస్తులతోనూ స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. వానపల్లి నుండి రోడ్డు మార్గంలో అయినవిల్లి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. హెలికాప్టర్ లో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ (Rajahmundry Airport) కి చేరుకుంటారు. అక్కడనుండి విమానంలో హైదరాబాద్ (Hyderabad) వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. Also Read : ఏపీలో మరో భారీ ప్రమాదం #rajahmundry-airport #cm-chandrababu #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి