Pawan Kalyan: ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవికి పవన్ బర్త్ డే విషెస్ మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నయ్య ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయన్నారు. తన ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని అన్నారు. By V.J Reddy 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pawan Kalyan: తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఆపద్బాంధవుడిగా ఆయన ఉన్నారని అన్నారు. ఎన్నికలకు కీలక దశకు చేరిన సమయంలోకి జనసేనకు రూ.5 కోట్లు ఇచ్చి తనకుం తోడుగా నిలిచాడని కొనియాడారు. చిరంజీవి ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయని అన్నారు. పవన్ కళ్యాణ్.. "నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో! గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను." అని పేర్కొన్నారు. ఆపద్బాంధవుడు అన్నయ్య అంటూ.. #ap-deputy-cm-pawan-kalyan #chiranjeevi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి