/rtv/media/media_files/2025/04/04/nZeImLtQBz0Vt570UCLT.jpg)
Divvela Madhuri
Duvvada: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. అయితే తాజాగా తన ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ మాధురి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తాము ఇద్దరం వెంకన్న సన్నిధిలో ఒక్కటయ్యామని, ప్రస్తుతం చాలా కంఫర్టుగా ఉన్నామని మాధురి చెప్పింది.
ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు ప్లాన్..
ఈ నేపథ్యంలోనే దువ్వాడను ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వాపోయింది. అతడిని హతమార్చేందుకే తమ ఇంటి కరెంట్ కట్ చేసారని చెప్పింది. బిళ్లు చెల్లించిన తర్వాత కనెక్షన్ కట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ప్రమాదం పొంచి వుందని తెలిసినా ప్రభుత్వం గన్ మెన్ ను తొలగించడపం అనుమానం వ్యక్తం చేసింది. ఏపీలో ఉంటే తమను బతకనివ్వరని, అందుకే తెలంగాణలోని హైదరాబాద్ లో షో రూం ఓపెన్ చేసినట్లు మాధురి వివరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరింది.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, వీణా శ్రీవాణి దంపతులను హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి కలిసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట.. పెళ్లికోసమేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. pic.twitter.com/ipj3XEAn95
— RTV (@RTVnewsnetwork) April 2, 2025
ఇదిలా ఉంటే.. విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ విడాకులు మంజూరు కాగానే.. తాము వివాహం చేసుకుంటామని ఇప్పటికే వీరు అనేక ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి ఇటీవలే ఈ జంట హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ భారీ ఎత్తున వస్త్ర దుకాణం కూడా వీరు ప్రారంభించారు. ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
duvvada-srinivas | divvala madhuri | telugu-news | today telugu news