/rtv/media/media_files/2025/04/07/TpTyQUZu1U5My9WLqAkF.jpg)
Deputy Collector dies in road accident Annamayya district
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ఈ ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అధికవేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్షపు డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించి తమ కుటుంబాలకు విషాదం మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. ఏపీలో దారుణమైన రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ ప్రాణాలు విడిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
డిప్యూటీ కలెక్టర్ మృతి
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఈ ఘోరమైన ప్రమాదం సంభవించింది.