ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండలం బాగుజోల గ్రామంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఆ తర్వాత నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కిన సమయంలో మొక్కుకున్నాను. కూటమి ప్రభుత్వం రూ.36.71 కోట్ల వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! ఆ తర్వాత 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నాం. 2017లో పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించాను. అప్పుడు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను చూశాను. ఈ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టింది గానీ.. ఈ ప్రాంతలకు మాత్రమ రోడ్లు వేయలేకపోయింది. ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డబ్బు లేకపోయినా కూడా గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తోంది. సుందరమై జలపాతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాలని'' పవన్ కల్యాణ్ అన్నారు. ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు