Israel: సంధి గురించి మాటలు ఒకవైపు ..భీకర దాడులు మరోవైపు ఇవాళో, రేపో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఆమోదం తెలపనుంది. అయితే ఈ లోపునే బీరుట్ మీద భీకర దాడులు చేస్తోంది. హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఐడీఎఫ్ చెప్పింది. By Manogna alamuru 26 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏదో ఇజ్రాయెల్ పైపై ఒప్పందాలు చేసకుంటోంది తప్పితే నిజంగా కాల్పుల విరమణ చేసుట్టు కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి కాల్పుల విరమణ మాకు ఓకే అంటోంది...ఆ ఒప్పందానికి రెడీ కూడా అయింది. కానీ దాడులను మాత్రం ఆపడం లేదు. బీరుట్ మీద విరుచుకుపడుతూనే ఉంది. హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులను చేస్తోంది. దీంతోపాటు దాడులు మొదలుకాకముందే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనేక భవనాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైమానిక దాడుల్లో ఎంతమంది మరణించారనే విషయం తెలియడం లేదు. కేబినెట్ సమావేశం.. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు ఓకే చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు...దీనికి సంబంధించి భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే సంధికి ఆమోదం చెబుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందానికి హెజ్బొల్లా కూడా అంగీకరించినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. ఒకవేళ ఇది ఇరువైపులా ఆమోదం పొందితే మాత్రం.. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కొనసాగుతోన్న యుద్ధం ముగింపునకు కీలక అడుగు పడినట్లే. Also Read: Delhi: ఉగ్రవాదానికి భారత్ బదులిస్తుంది–మోదీ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి