AP : తీవ్ర వాయుగుండం..ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఆ తరువాత అది ఉత్తర -వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపారు. By Bhavana 27 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Ap Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆ తరువాత అది ఉత్తర -వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది. Also Read: Israel: సంధి గురించి మాటలు ఒకవైపు ..భీకర దాడులు మరోవైపు భారీ నుంచి అతి భారీ.. దీని ప్రభావంతో రాబోయే అయిదు రోజుల్లో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు , ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ వివరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా తీరంలో గరిష్ఠంగా గంటకు 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.తుపాను తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సి ఉంది. Also Read: HYD: జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం...ఇంకా అదుపులోకి రాని మంటలు తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు శుక్రవారం వరకు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం చెప్పింది. విశాఖ పట్నం, గంగవరం,కాకినాడ, మచిలీ పట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ చేసింది. వరి కోత దశలో ఉండడంతో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తుంది. Also Read: రఘురామ థర్డ్ డిగ్రీ కేసు.. కీలక పోలీస్ అధికారి అరెస్ట్! దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తమిళనాడు – శ్రీలంకలోని ట్రికోమలి వైపు వెళ్తుంది. తీవ్ర వాయుగుండం ప్రభావం ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై అధికంగా ఉంటుందని తెలుస్తుంది. ఈనెల 29న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. వాయుగుండం ముప్పునకు రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయి. Also Read: Rahul:రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దుపై పిటిషన్..ఆలోచిస్తున్నామన్న కేంద్రం చాలా వరకు వరి ఎక్కడికక్కడ పొలాల్లో ఉంది. ఈ దశలో భారీ వర్షాలు నమోదైతే భారీ నష్టమే జరుగుతుంది. బలమైన గాలులు వీచే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక వరి పంటలు నెలకొరిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగం తగిన జాగ్రత్తలు చేపట్టడం అవసరమని ఐఎండీ సూచనలు జారీ చేసింది. మరో వైపు, ఏపీ దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తేలికపాటి నుంచి మొదలయ్యే వర్షాలు క్రమేపీ పెరుగుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఇక, ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి