/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు భారీ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇక తెలంగాణలో అక్టోబర్ నెల మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుండి 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్‌పూర్, పారదీప్ పోర్టులకు సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మరోవైపు అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముంది.
Depression Update-2: Depression forms in Bay Of Bengal and started tracking towards North AP - Odisha Border. pic.twitter.com/VDix0licBt
— Andhra Pradesh Weatherman (@praneethweather) October 1, 2025
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తున్నాయి. రేపు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపాయి.
తెలంగాణలో 10 రోజులు వర్షాలు
వర్షాకాలం ముగిసినా సరే.. అక్టోబర్ 1-10వ తేదీ వరకు పలు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. అలానే తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడేందుకు అవకాశం ఉంది అంటున్నారు. అలానే అక్టోబర్ 11-20వ తేదీ వరకు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కారణంగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.