CBN: మా అమ్మ కన్నీళ్లు చూసి ..వెంటనే ఆ నిర్ణయం తీసుకున్నాను!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీపం పథకం తీసుకుని రావడానికి తన తల్లి కన్నీళ్లే అని చెప్పుకొచ్చారు.

New Update

CBN: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల కోసం రూపొందించిన అనేక కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

ఈ సందర్భంగా కొందరు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అలాగే దీపం పథకం అమలు చేయడానికి గల కారణాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. చిన్నప్పుడు వంట గదిలో తన తల్లి కన్నీళ్లు చూసే ఈ పథకం తెచ్చినట్లు చంద్రబాబు చెప్పారు."మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే నాకూ మా అమ్మ గురించి ఉన్నాయి. మాది మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయమే మాకు ఆధారం. నేను చదువుకునేటప్పుడు మా అమ్మ తెల్లవారుజామునే నిద్రలేచి మాకు వంట చేసేది. అప్పుడు నేను హైస్కూలుకు పోయేవాణ్ని. 

Also Read: Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు

స్కూల్‌ చంద్రగిరిలో ఉంటుంది. ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఉదయం 9 నుంచి 9:30 మధ్య స్కూలు ప్రారంభమవుతుంది. అక్కడకు నడిచి వెళ్లాలంటే ఉదయాన్నే ఆరున్నర గంటలకు ఇంటి నుంచి బయల్దేరాలి. ఇంక మధ్యాహ్న భోజనం ఇంటి నుంచే తీసుకెళ్లాలి. ఆరున్నరకల్లా వంట పూర్తి చేసి క్యారియర్ కట్టాలంటే, నాలుగున్నర కల్లా మా అమ్మ నిద్రలేచేది. వంట పూర్తి చేసి, మమ్మల్ని రెడీ చేసి స్కూలుకు పంపించేది."

కళ్లనిండా నీళ్లు...

"వంట చేసి మా అమ్మ బయటకు వచ్చినప్పుడు కళ్లనిండా నీళ్లు కనిపించేవి. పొగ నిండుకుని కళ్లల్లో నీళ్లు వచ్చేవి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అమ్మ పడిన కష్టం ఏ ఆడబిడ్డా పడకూడదని దీపం పథకం తెచ్చా. దీపం పథకం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు అందించాను. మా అమ్మ కష్టం చూసే 1995లో దీపం పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు మళ్లీ గ్యాస్ రేట్లు పెరిగాయని కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి చూసి, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Also Read: Peanuts Peel: పల్లీల పొట్టుతో కూడా పుట్టెడు లాభాలు.. ఏంటంటే?

Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

Advertisment
తాజా కథనాలు