రూ.1200కోట్ల సినిమా మిస్ చేసుకున్న సామ్.. అందులో హీరో ఎవరో తెలుసా..! నటి సమంత బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 1200 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ చేసుకుంది. అయితే షారుఖ్ నటించిన 'జవాన్' లో సమంత చేయాల్సింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ ఛాన్స్ నయనతారను వరించింది. ఆరోగ్య సమస్యల కారణంగా సామ్ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. By Archana 25 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update samantha షేర్ చేయండి Samantha: సినీ ఇండస్ట్రీ ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం కామన్. అలా కొన్ని సూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్న హీరోలు, హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. గతంలో రామ్ చరణ్- రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'మగధీర' సూర్య చేయాల్సిన సినిమా.. చరణ్ చేతికి వెళ్ళింది. అదేవిధంగా ఏకంగా 1200 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మిస్ చేసుకుంది ఓ స్టార్ హీరోయిన్. Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్ నయనతార కాదు సమంత.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ నటి సమంత. షారుక్ ఖాన్ రికార్డు బ్రేకింగ్ 'జవాన్' సినిమాలో సమంత నటించాల్సింది. కానీ అనుకోని పరిస్థితిల్లో ఆ ఛాన్స్ లేడీ సూపర్ స్టార్ నయనతారను వరించింది. అయితే ఆ సమయంలో సామ్ కొన్ని వ్యక్తిగత, ఆరోగ్య పరిస్థితుల కారణంగా వదులుకోవాల్సి వచ్చింది. మయొసైటిస్ బారిన పడిన సమంత ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో ఆ టైంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంది. సామ్ ఇటీవలే 'సిటాడెల్ : హనీ బన్నీ' వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సమంత సరసన బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించారు. నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఈ సీరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఓటీటీలో ఈ సీరీస్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ రాజ్ & డీకే తెరకెక్కించిన ఈ చిత్రంలో కే కే మీనన్, సిమ్రాన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీమ్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ సింగ్ పరిహార్, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి