ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ

విజయ్, రష్మిక ఇద్దరూ ఓ రెస్టారెంట్ లో కనిపించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడ తీశారనేది మాత్రం తెలియరాలేదు. ఈ ఫొటోతో విజయ్, రష్మిక నిజంగానే సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది.

New Update
vj

టాలీవుడ్ ఆన్ స్క్రీన్ పెయిర్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ వెకేషన్ వెళ్లే ప్లేస్ కు రష్మిక కూడా వెళ్లడం, విజయ్ ఇంట్లోనే ప్రతి పండగను జరుపుకోవడం లాంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. 

పైకి ఈ జంట ఫ్రెండ్స్ అంటూ చెబుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం వీళ్ళు సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని చెప్తుంటారు. తాజాగా అదే నిజమైంది. మ్యాటర్ ఏంటంటే.. విజయ్, రష్మిక ఇద్దరూ ఓ రెస్టారెంట్ లో కనిపించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : కమెడియన్ ఆలీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ

 ఒక్క ఫొటోతో క్లారిటీ వచ్చేసిందిగా..

ఈ ఫొటోలో విజయ్, రష్మిక ఇద్దరూ తమ ఫేవరెట్ ఫుడ్ ను తింటున్నారు. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటో ఎప్పుడు,  ఎక్కడ తీశారనేది మాత్రం తెలియరాలేదు. ఈ ఫొటోతో  విజయ్, రష్మిక నిజంగానే  సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. దీంతో ఈ ఫొటోను ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. 

తన మ్యూజిక్‌ ఆల్బమ్‌ ‘సాహిబా’ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సింగిల్‌ కాదని.. రిలేషన్‌లో ఉన్నానని చెప్పారు. కోస్టార్‌తో డేటింగ్‌ చేశానని తెలిపారు. విజయ్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారిన తరుణంలో ఈ ఫొటో బయటకు రావడంతో వీళ్ళ ప్రేమ నిజమేననే ప్రచారం ఊపందుకుంది. మరి ఈ ఫొటోపై విజయ్ కానీ, రష్మిక కానీ రియాక్ట్ అవుతారేమో చూడాలి.

Also Read : వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు