/rtv/media/media_files/2025/08/18/ycp-2025-08-18-10-39-20.jpg)
సంచలనంగా మారిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి బూతులు తిట్టిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇచ్చేలా ఎమ్మెల్యేల వైఖరి ఉండొద్దని సూచించినట్లు సమాచారం. తప్పుడు ప్రచారంపై వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేల తప్పులతో జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని సీఎం ప్రశ్నించారు. ఈ రకమైన వ్యాఖ్యలు.. తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యేల వ్యవహరి శైలిపై ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరించారు సీఎం చంద్రబాబు.
మరోవైపు వైరల్ గా మారిన ఆడియోపైన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడినని అన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారని, ఆ ఆడియో కాల్స్ నావి కాదని, రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. నారా, నందమూరి కుటుంబాలకు తాను ఎప్పటికీ విధేయుడునే అని చెప్పుకొచ్చారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు మనసును నచ్చుకొని ఉంటే తన వైపు నుంచి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇంతకీ ఆడియోలో ఏముంది?
తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య జరిగింది. వార్-2 సినిమా రిలీజ్ సందర్భంగా అనుమతులతో ఈ సినిమాను ఆడిస్తున్నారా లేదా అని అతడ్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సినిమాకు అన్ని అనుమతులు ఉన్నా సరే నేను అనంతపురం ఎమ్మెల్యేను.. సినిమా ఆడదన్నారు, ఆడనివ్వనన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆడియో కాల్ లో ఉంది. మంత్రి లోకేష్ పై ఎన్టీఆర్ అలా ఎలా మాట్లాడుతాడని ఆడియో కాల్ లో ఎమ్మెల్యే ప్రశ్నించారు. లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటమా వెంటనే థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను పంపించాలని ఫోన్ లో ఎమ్మెల్యే సూచించారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఎమ్మెల్యే ప్రసాద్‌పై తారక్ అభిమానుల మండిపడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి..
— Venka Reddy (@VenkaRe59075620) August 17, 2025
సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నారని వ్యాఖ్య pic.twitter.com/PfxIdAfP4b