Crime News: చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్‌.. దోపికి పన్నాగం పన్నింది మరెవరో కాదు!

చిత్తూరులో దొంగల కాల్పుల ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసు కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారి పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్‌ యజమాని దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

New Update
Chittoor Pushpa Kids World owner Chandrasekhar house shooting incident big Twist

Chittoor Pushpa Kids World owner Chandrasekhar house shooting incident big Twist

చిత్తూరు పట్టణంలో తాజాగా దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. గాంధీనగర్ లోని లక్ష్మీ సినిమా హాల్‌ సమీపంలో ఉన్న ప్రముఖ వ్యాపారి, పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దూరిన దొంగల ముఠా రబ్బరు బులేట్లతో కాల్పులు జరిగింది. అయితే ఈ కాల్పుల ఘటన కీలక మలుపుతిరిగింది. వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో మరో వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని పన్నాగం పన్నినట్లు గుర్తించారు. కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దొంగల ముఠాను ఎస్ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరు తుపాకులతో వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడికి చొరబడి.. వారి ఇంట్లో రబ్బర్ బుల్లెట్లు వినియోగించినట్లు తెలిపారు. 

Also Read: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

ఏదేమైనా దొంగలు ఎప్పుడైతే వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారో.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి దొంగల ముఠాను అరెస్టు చేశారు. 

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

ఏం జరిగింది..?

చిత్తూరు పట్టణంలో దొంగలు ఈరోజు బీభత్సం సృష్టించారు.  ఉదయం గాంధీనగర్ లోని లక్ష్మి సినిమా హాల్‌ సమీపంలో పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి దూరారు. అనంతరం ఇంటిలో వారిని తుపాకులతో బెదిరించారు. రెండు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

దీంతో పోలీసులు ఇంటిని రౌండ్ చేసి లొంగిపోవాలని దొంగలను ఆదేశించారు. మొత్తం పది మంది దొంగలు రివాల్వర్లతో చొరబడి ఇంట్లో సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారు. పది మంది దొంగల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో వ్యాపారి చంద్రశేఖర్‌కు గాయాలయినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు