/rtv/media/media_files/2025/05/21/4tb11qioPz3Adm235uJV.jpg)
Chandrababu govt big shock to YSRCP Sajjala Ramakrishna Reddy
AP News: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని తన 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అటవీ భూమిపై చర్యలు తీసుకుంటోంది.
అటవీ శాఖకు 52 ఎకరాలు..
ఈ మేరకు రేపు ఈ భూములను అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతంలోనే సజ్జల కుటుంబసభ్యులకు 146 ఎకరాల భూమి ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సజ్జలకు సర్వే నంబరు 1,629లో 11 వేల ఎకరాల భూమి ఉంది. అందులో 63 ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’
దీంతో విచారణ జరిపిన అధికారులు సజ్జల ఎస్టేట్‌కు చెందిన 184 ఎకరాల్లో 63 ఎకరాల ఆక్రమిత భూమి ఉందని గుర్తించారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి కూడా ఉండగా దీనిపై ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది బోర్డులు పెట్టారు. 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు ఇవ్వనున్నారు.
sajjala | land | cm chandrababu | telugu-news | today telugu news