New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ.. ఎప్పుడంటే? AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నూతన రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి కానుకగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. By V.J Reddy 25 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Ration Cards: ఏపీలో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీల్లో ఒకటైన, ముఖ్యమైన నూతన రేషన్ కార్డుల జారిపై అడుగులు ముందు వేసింది. కొత్త రేషన్ కార్డులను ఎప్పడు ఇస్తారనే దానిపై జరుగుతున్న చర్చలకు సీఎం చంద్రబాబు తెర దింపారు. సంక్రాంతి కానుకగా అర్హులకు రేషన్ కార్డులను అందించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులో కోసం ప్రజల నుంచి వచ్చే నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. Also Read: కోరిక తీర్చాలంటూ మహిళకు SI వేధింపులు..! పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి.. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న, ప్రస్తుతం అమలు చేసిన పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు ఉండడం తప్పనిసరి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయాలన్నా... విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్నా... దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా... రేషన్ కార్డు ఉండడం ఖచ్చితం. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని అధికారులు ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేస్తారు. రేషన్ కార్డు ఉన్నవారే ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారన్నమాట. కొత్త కార్డుల మంజూరు చేయడంతో పాటు, ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పిస్తూ డిసెంబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు వచ్చే నెల 28 వరకు.... కొత్తగా కార్డులు, ఉన్న కార్డులో మార్పులు, చేర్పుల కోసం డిసెంబర్ 2 నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులను గుర్తించి... సంక్రాంతి పండగ కానుకగా కొత్త రేషన్ కార్డులను అందిచాలని కూటమి సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న సీఎం చిత్రం, వైసీపీ రంగులతో ముద్రించిన పంచదార, కందిపప్పు ప్యాకింగ్‌ను కూటమి ప్రభుత్వం మార్చింది. కార్డుల రంగులను కూడా మార్చి కొత్తవి అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. Also Read: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..! #new-ration-card #chandrababu #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి