రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోకి వైసీపీ నాయకులు క్యూ కడుతున్నట్లు సమాచారం. అయితే వైసీపీలో ఉన్న వివాదాస్పద నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే గందరగోళం ఏర్పడుతుందని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్! చేరికలకు రెడ్ సిగ్నల్ ఇలా చేర్చుకోవడం ద్వారా అన్ని పార్టీల క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తున్నందున చేరికలకు కాస్త టైం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల కొందరు నాయకులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఓ రెండు మూడు నెలలు సైలెంట్‌గా ఉండి.. ఆ తర్వాత పార్టీలో చేరే అంశంపై చర్చించవచ్చని కూడా రాజకీయ వర్గాల సమాచారం. ఇది కూడా చదవండి: SBIలో 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలివే! అయితే ఇప్పటికే ఇద్దరు నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఆ నేతలు చర్చించినట్లుగా చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్ ఇటీవల పవన్ సోదరుడు నాగేంద్రబాబుకు మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాగేంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తేదీని కూడా ఫిక్స్ చేసేందుకు చంద్రబాబుతో పవన్ మాట్లాడినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో మంచి రోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేసేందుకు నాగేంద్ర బాబు ఆసక్తి చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గంలోకి అడుగుపెడతాడో. ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!