తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్మాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం ఇటీవల కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 59 మందితో కూడిన నామినేటెడ్ పదవుల రెండో జాబితా ఇటీవల రిలీజ్ చేసింది. అందులో ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలా మంది చాగంటి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
అదే సమయంలో మరికొందరిలో ఒక ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా చంద్రబాబు, జగన్ హయాంలో ఆయనకు కీలక పదవి అప్పగిస్తే ఒప్పుకోలేదని గుర్తు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఒప్పుకుంటారా? లేదా? అనేది వారిలో క్వశ్చన్ మార్క్. అయితే వారి డౌట్ తాజాగా క్లియర్ అయింది.
ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!
రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగిస్తూ సలహాదారుగా నియమించిందని.. దాన్ని తాను సంతోషంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. అయితే తాను ఒప్పుకున్నది పదవి కోసం కాదని అన్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్!
అందువల్లనే ఒప్పుకున్నాను
తనకి ఇప్పుడు ఏ గౌరవం తక్కువ కాలేదని పేర్కొన్నారు. మరో ఐదారేళ్లు ఆరోగ్యంగా ఏమైనా చెయ్యగలనని.. అందువల్ల ఈ కొన్నేళ్లలో వేల మంది పిల్లలను కూర్చోబెట్టలేనని అన్నారు. అయితే ప్రభుత్వ పరంగా వాళ్లు కూర్చోబెడితే ఓ నాలుగు మంచి మాటలు చెప్పగలనని తెలిపారు. అందువల్లనే తాను ఈ బాధ్యతను ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ!
అంతేకాకుండా దేశానికి, సమాజానికి యువకుడిగా ఉన్నపుడే బాగా ఉపయోగపతారని అన్నారు. వృద్ధుడయ్యాక తెలియక తప్పులు చేశాను అని అనుకున్నా పశ్చాత్తాపం మిగులుతుంది తప్ప ఇంకేం చేయలేం అని తెలిపారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా నైతిక విలువలు పాటించాలని.. వాటిని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని తెలిపారు.