సచివాలయంలో రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా మొత్తం 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కోత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు!
రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సచివలయ వర్గాల సమాచారం. దీపావళి నుండి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం పై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వ నూతన పాలసీలు:
ఇది కూడా చదవండి: దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అర్థరాత్రి ఆటోలో అత్యాచారం
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ నూతన విధానాలు రూపొందిస్తుంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుట్టింది. మూడు నెలల పాటు ఆయా శాఖల అధికారులు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి పాలసీలు సిద్దం చేశారు.
ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!
ఇప్పటికే దాదాపు 10 శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్దం చేశారు. ముఖ్యమంత్రి వరుస సమీక్షలతో పలు శాఖల్లో కొలిక్కి వచ్చిన నూతన విధానాలపై కసరత్తు చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే ప్రధాన లక్ష్యంతో అధికారులు పాలసీలు సిద్దం చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ విధానాల ఆధారంగా అధికారులు కొత్త పాలసీలు రూపొందించారు.
క్యాబినెట్ ముందుకు 5-6 ప్రభుత్వ నూతన పాలసీలు!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్స్క్ పాలసీలు క్యాబినెట్ ముందుకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అదే సమయంలో ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: RGV డెన్ లో 'యానిమల్' డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?
అంతేకాకుండా ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్‌గా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించినట్లు తెలుస్తోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ఎక్కువగా కసరత్తు చేస్తున్నట్లు చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్ఎంఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సమాచారం. అంతేకాకుండా విద్యుత్ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.