/rtv/media/media_files/2025/11/10/bus-driver-dies-after-heart-attack-2025-11-10-14-20-11.jpg)
Bus driver dies after heart attack, saves 50 people
APNews: ఈ మధ్య కాలంలో మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అప్పటిదాక మనతో సరదాగా ఉండే వ్యక్తులు కూడా ఆ మరుక్షణమే కనిపించకుండా పోవచ్చు. అందరినీ నవ్విస్తూ..నవ్విస్తూనే కళ్లముందే కనుమూయచ్చు. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. అయితే తను మరణిస్తూ మరో 50 మందికి జీవం పోసిన ఘటన అందర్నీ కదిలించింది. తెలిసిన వివరాల ప్రకారం..కాలేజీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దీంతో ప్రమాదం జరగకుండా నివారించగలిగాడు. అనంతరం బస్సును పక్కకు నిలిపి మృతి చెందాడు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డి.నారాయణరాజు గత కొంతకాలంగా రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడ కొత్తపేట మండలం గంటి నుంచి విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు వెళ్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ క్షణం మరొకరైతే స్టీరింగ్ వదిలేసి బస్సులో నుంచే దూకేవారు. కానీ , డ్రైవర్ ముందు చూపుతో వేగాన్ని తగ్గించి బస్సును నిలిపి స్టీరింగ్‌పై వాలిపోయాడు. ఏమైందోనని అనంతరం విద్యార్థులు గమనించి వెళ్లి చూడగా ఆయన విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తాను చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడిన నారాయణరాజును తలుచుకుని స్థానికులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us