/rtv/media/media_files/2026/02/14/bill-gates-to-visit-amaravati-on-february-16-2026-02-14-19-16-07.jpg)
Bill gates to Visit Amaravati on February 16
ఫిబ్రవరి 16వ తేదీని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఆయన ప్రతినిధి బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌తో బిల్‌గేట్స్ సమావేశం కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు బిల్‌గేట్స్ రాష్ట్ర సచివాలయానికి రానున్నారు.
ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, ఫలితాలను సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌కు వివరించనున్నారు. ఆ తర్వాత గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు భేటీ కానున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Also Read: బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ..? కారణం ఇదే
మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని స్కీమ్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ఆ తర్వాత అమరావతిలో ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి బిల్ గేట్స్ బృందం వెళ్లనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు.
బిల్‌గేట్స్ రాకపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎల్లుండి అమరావతికి బిల్‌గేట్స్ వస్తున్నారని తెలిపారు. ఆయన్ని మూడుసార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదేనని పేర్కొన్నారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: 'కొవిడ్ కన్నా పెద్దది జరగబోతోంది'.. ఏఐపై హైప్‌రైటర్ సీఈవో సంచలన హెచ్చరిక
Follow Us