అరబిందో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 108, 104 సర్వీసుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆ సంస్థ తాజాగా ప్రభుత్వానికి తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ హయాంలో ఏడేళ్ల కాలపరిమితితో వేరు వేరుగా 108 (అత్యవసర వైద్యం), 104 (సంచార వైద్యం) టెండర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుంది.
Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం
అరబిందో కీలక నిర్ణయం
అయితే 108, 104 సర్వీసులు ఘోరంగా ఉన్నాయని.. ఈ విషయంలో సంస్థ నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా ఈ రెండు సర్వీసుల పనితీరుపై కాగ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సర్వీసుల నిర్వహణలో గుర్తించిన అవకతవకలు, లోపాలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ నివేదికల ఆధారంగా వివరణ కోరుతూ అరబిందో యాజమాన్యానికి ప్రభుత్వం ఇటీవల నోటీసులను జారీచేసింది.
Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా
ఈ క్రమంలోనే అరబిందో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు అంబులెన్స్ సర్వీసుల నుంచి తప్పుకుంటున్నట్లు అరబిందో యాజమాన్యం ప్రభుత్వానికి వెల్లడించింది. అదే సమయంలో ప్రభుత్వ పరంగా బిల్లుల చెల్లింపుల్లోనూ అనేక ఇబ్బందులు ఉన్నట్లు అందులో వివరించింది.
Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్
కాగా గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏడేళ్ల కాలపరిమితికి గానూ టెండరు గడువు పూర్తి కావడానికి ఇంకా రెండున్నర ఏళ్ల వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే అరబిందో సంస్థ కీలక నిర్ణయం తీసుకుని.. ఈ రెండు సర్వీసుల నుంచి వైదొలిగింది. దీంతో ఈ సర్వీసుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!
. . . . .