/rtv/media/media_files/2025/09/17/ash-mafia-war-2025-09-17-11-06-37.jpg)
Ash mafia war..Police arrest Jogi Ramesh..
Big breaking : బూడిద మాఫియాకు వ్యతిరేకంగా … బుధవారం ఆందోళన చేపట్టిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. బూడిద డంపు వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. నలుగురికి మాత్రమే అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో … ఈరోజు మూలపాడులో బూడిద డంపుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమార్జన చేశారని జోగి రమేష్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. అయితే.. జోగి రమేష్ వ్యాఖ్యలను వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దీంతో మూలపాడులో ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు బూడిద డంపుకు వెళ్లడానికి వైసీపీ సన్నద్ధమవ్వగా పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతల నడుమ మాజీ మంత్రి జోగి రమేష్, వారి అనుచరులను వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ వైపు తరలించారు. వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సీ ఐ చంద్రశేఖర్,100 మంది పోలీసు సిబ్బందితో కలిసి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
VTPS నుంచి ఉచితంగా బూడిద ఇవ్వకుండా బూడిద డంపుల వద్ద బూడిద పంపిణీకి.. వ్యతిరేకంగా జోగి రమేష్ ఆందోళనకు దిగారు. బూడిద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. VTPS నుంచి ఉచితంగా ఇవ్వాల్సిన బూడిదను డంప్ చేస్తూఎమ్మెల్యే, ఆయన బావమరిది బూడిద కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బూడిద కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసనకు జోగి పిలుపునిచ్చారు. అయితే ఆందోళనకు పర్మీషన్ లేదంటూ నిన్న వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులిచ్చారు.ప్రజాఉద్యమానికి సహకరించాలంటూ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ భర్త గరికపాటి రాంబాబు, వైసీపీ నేతలు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
రోజుకి రూ. 25 లక్షల అక్రమార్జన చేస్తూ బూడిద కుంభకోణానికి పాల్పడుతున్నారని జోగి రమేష్ ఆరోపించారు. ఆ డంప్ ఎవరిదని ప్రశ్నిస్తే లోకేష్ పెట్టమన్నారని చెప్తున్నారన్నారు. ఈ కుంభకోణంలో దోషులెవరో తేల్చాలని లోకేశ్‌ని కోరుతున్నానన్నారు. బూడిద కాలుష్యంతో ప్రజల వ్యాధులతో బాధ పడుతున్నారన్నారు.ప్రజల ప్రాణాలతో ఎమ్మెల్యే,ఆయన బావమరిది ఆడుకుంటున్నారని ఆరోపించారు. నన్ను అరెస్ట్ చేస్తే బూడిద సమస్య తీరుతుందా?వెంటనే బూడిద డంప్ తొలగించి, బూడిద దొంగలను అరెస్ట్ చేయాలని జోగి డిమాండ్ చేశారు.
Also Read: Dhanush Son: ఫస్ట్ టైమ్.. కొడుకుతో కలిసి దుమ్మురేపిన ధనుష్.. డాన్స్ వీడియో వైరల్!