అప్పుడేమో రెస్టారెంట్ కు తీసుకెళ్లారు. ఇప్పుడేమో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే పరుపు వేసి సేవలు చేశారు. దీంతో బోరుగడ్డ అనిల్ కు ఎవరైతే సేవలు చేస్తున్నారో వారిపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బోరుగడ్డ అనిల్ కేసులో అరండల్ పేట సీఐ కుంకా శ్రీనివాసరావుపై వేటు పడింది. సీఐ శ్రీనివాసరావును వీఆర్ కి పంపిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. కస్టడీలో ఉండగా బోరుగడ్డ అనిల్ కోసం బల్లపై పరుపు వేసిని దృష్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో సీఐపై వేటు పడింది.
Also Read: US: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఐజీ ఆదేశించారు. దీంతో ఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై వేటు వేశారు. కాగా ఇప్పటికే ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. వరుసగా బోరుగడ్డ వీడియోలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ వీడియోలో పోలీసు కుర్చీలో కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. అంతేకాకుండా నిద్రపోయేందుకు దిండు, దుప్పటి ఇచ్చి ఏర్పాట్లు చేశారు. ఇది కాకుండా మొన్నటికి మొన్న మరో వీడియోలో బిర్యానీతో విందు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసుల తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
Also Read: Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!
బిర్యానితో విందు
గతంలో తుళ్లూరు పోలీస్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అనిల్ కుమార్ ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు బయల్దేరారు.
Also Read: USA: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
తిరిగి వస్తున్న క్రమంలో గన్నవరం సమీపంలోని ఓ లగ్జరీ హోటల్ వద్ద ఆగి భోజనం చేశారు. పోలీసులు తమతో పాటు బోరుగడ్డ అనిల్ ను మర్యాదగా, గౌరవంగా లోపలకి తీసుకెళ్లారు. తమతో పాటే అనిల్ కు బిర్యానీ, చికెన్ లతో భోజనం పెట్టించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.
బల్లపై పరుపు, దిండు, దుప్పటి వేసి మర్యాదలు
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
బిర్యానీ దావత్ వీడియోలు మరువక ముందే మరో వీడియో సంచలనం సృష్టించింది. అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో బోరుగడ్డకు మరోసారి పోలీసులు రాచమర్యాదలు చేశారు. పోలీసులు దగ్గరుండి కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించారు. అక్కడితో ఆగకుండా పడుకోవడాని ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా మరో వీడియో వైరల్ కావడంతో అరండల్ పేట సీఐ శ్రీనివాస రావుపై వేటు పడింది. దీంతో బోరుగడ్డ అనిల్ దెబ్బకు మొత్తం 8 మంది పోలీసులు బలియ్యారనే చెప్పాలి.