/rtv/media/media_files/2025/06/11/d6o7QSPvsZH0LMOIDRWq.jpg)
AP Politics
AP Politics: ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు బోర్డు పరిశీలన కోసం జరిగిన పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ రాక సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. జగన్‌ను స్వాగతించేందుకు స్థానిక శ్రేణులు పెద్ద ఎత్తున రావటంతో పొదిలి చుట్టుపక్కల వాతావరణం ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది.
వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడి..
ఇటీవల జగన్ కు చెందిన మీడియాలో అమరావతి మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ కొందరు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, వారికి మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ పార్టీ అధినేత పర్యటనను ఓర్వలేకే టీడీపీ శ్రేణులు ఈ విధంగా దాడులకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు జగన్ పర్యటనలో భారీగా పోలీసులను మోహరించారు. దాడులు, ప్రతిదాడులు, పోలీసులకు గాయాలతో జగన్ పర్యటనలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
#YCPinsultsWomen#YCPattacksWomen #PsychoFekuJagan
— Lokesh Nara (@naralokesh) June 11, 2025
పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు, పోలీసుల పై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి గారు మొన్న తెనాలి గంజాయి బ్యాచ్… pic.twitter.com/yYCcBnvXsN
ఈ విషయమై పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేష్ ప్రకటన విడుదల చేశారు. మహిళలు, పోలీసుల పై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: గోండ్ కటిరా ఎప్పుడైనా తిన్నారా..? తింటే ఏమి జరుగుతుందో తెలుసా..!!
ఇది కూడా చదవండి: బెల్లం టీ తయారీ విధానం.. దాని ప్రయోజనాలు
( ap-politics | jagan | Latest News)