/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-ap-news-politics-that-kodali-has-facing-cancer-media-telecast-news1.jpg)
AP Police issue lookout notice for Kodali Nani
BIG BREAKING: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ నానికి లుకౌట్ నోటీసులను జారీ చేశారు. నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
పాస్ పోర్ట్ సీజ్..
ఈ మేరకు నాని అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే త్వరలోనే నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతేకాదు నాని కదలికలపై నిఘా పెట్టాలని ఫిర్యాదు చేసిన కనపర్తి.. అనారోగ్య సమస్యల పేరుతో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నాని పాస్‌పోర్టును సీజ్ చేయాలని పోలీసులను కోరారు.
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
కొడాలి నానిపై మట్టి, ఇసుక అక్రమ రవాణా తదితర ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ తదితరులపై ఆయన అసభ్య పదజాలంతో దూషించాడని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఇదే తరహా అభియోగాలతో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ తదితరులు జైలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొడాలి కూడా జైలుకు వెళ్తాడన్న చర్చ చాలా రోజులుగా ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన దేశం దాటే ప్రయత్నాలు చేస్తున్నాడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
kodali nani | lookout-notice | telugu-news | today telugu news