/rtv/media/media_files/2025/04/01/ZfLDE6R3n2yG9GyifCuS.jpg)
ap rationcard
AP New RationCards: పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు.
ATM కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు🙏 : మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు @mnadendla pic.twitter.com/FKPNXxXmJD
— Arjilli Appalaraju (@Arjilli999ARaj) April 1, 2025
ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే..
ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్డులో కుటుంబసభ్యులను చేర్చుకోవడంతోపాటు తొలగించేందుకు కూడా ఆప్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందని, నేటినుంచి దీపం-2 రెండోవిడత సిలిండర్ బుకింగ్ మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు. వాట్సప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించాం. ఇప్పటికే వాట్సప్ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు, కోటిన్నర కుటుంబాలకు 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం అందిస్తున్నామని, పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక నెల తీసుకోకపోయినా 3 నెల తీసుకునే అవకాశం కల్పించాం. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నామని, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి.
ration-cards | nadendla-manohar | cm-chandrababu | telugu-news | today telugu news