Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!

సచివాలయ సిబ్బంది హాజరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేసింది. అటెండెన్స్ మొబైల్ యాప్‌లో ఇక నుంచి రెండు సార్లు హాజరు తీసుకోనున్నారు. గతంలో ఒకసారి నమోదు చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు రూల్‌ మారింది.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

Ap : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్‌ విషయంలో ఏపీ  ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరును మొబైల్ యాప్‌లో తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు. అటెండెన్స్ మొబైల్ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. ఇక నుంచి రోజుకు రెండుసార్లు హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వార్డు సచివాలయానికి వచ్చిన సమయంలో చెక్ ఇన్.. అలాగే విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో కూడా ఇక నుంచి  అటెండెన్స్‌ వేయాల్సి ఉంటుంది.

Also Read: AP Rains: ఏపీలో భారీ వర్షాలుల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

ఆరోజును సెలవుగా..

సచివాలయానికి వచ్చిన సమయం.. అలాగే వెళ్లేటప్పుడు సమయాన్ని రెండింటినీ కూడా నమోదు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు తెలిపారు. అలాగే హాజరు నమోదు సమయంలో రెండింటిని ఒకేసారి నమోదు చేస్తే ఆరోజును సెలవుగా పరిగణిస్తామంటూ అధికారులు హెచ్చరించారు.

Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు

ఈ విషయమై ఉద్యోగులకు ఇప్పటికే మెసేజ్‌ లు  పంపించినట్లు చెప్పారు. అయితే గతంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు విధానం వేరుగా ఉండేది. సచివాలయానికి వచ్చినప్పుడు లేదా.. వెళ్లేటప్పుడు ఒక్కసారి అటెండెన్స్ మొబైల్ యాప్‌లో హాజరు నమోదు చేసుకుంటే సరిపోయేది. 

Also Read: పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత కీలక భరోసా

అయితే ఈ విధానం వల్ల కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఇప్పుడు రెండు సమయాల్లోనూ హాజరు వేయాలని సిబ్బందికి తెలిపారు. అలాకాకుండా ఒకేసారి నమోదు చేసినా, ఒకే ఎంట్రీ ఉన్నా కూడా ఆ రోజును సెలవుగా పరిగణిస్తామని ప్రకటించారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా  హాజరు వేయాలి.లేకపోతే పనిచేసినప్పటికీ కూడాఅటెండెన్స్ లేకపోతే సెలవుగా మారిపోతుంది మరి.

Also Read: తండ్రి పాత్రలో చిరంజీవి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో?

Advertisment
Advertisment
తాజా కథనాలు