రోజా నెలకు రెండు పూటలు అక్కడే.. హూం మంత్రి అనిత షాకింగ్ కామెంట్స్!

వైసీపీ నేత రోజాపై ఏపీ హూమ్ మంత్రి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. రోజా నోటికి అడ్డు అదుపు ఉండదని విమర్శించారు. నెలకు రెండు పూటలు ఏపీలో ఉంటే మిగతా రోజులు తమిళనాడు, కర్ణాటక, ప్రాన్స్‌లో ఉన్న ఆమెకు ప్రజల కష్టాలు తెలియవని మండిపడ్డారు.

New Update
ycp leader roja

ఆంధ్రప్రదేశ్ హూమ్ మంత్రి అనిత చిత్తూరు తిరుపతి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు రెడ్ శాండిల్, గంజాయికి అడుకట్ట వేసే విషయాల గురించి మాట్లాడారు. ఈ విషయంలో పోలీసులు టెక్నికల్‌గా అభివృద్ధి చెందాలి అని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్ చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాం అని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నేరాలు జరిగాయని అన్నారు. అయితే ఇప్పుడు నేరాలు అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు అను సంధానం చేస్తాం అని తెలిపారు. 

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

ప్రస్తుత కాలంలో నేరాలు అదుపు చేయడంతో పాటు ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం అని.. ఎర్రచందనం కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టాం అని పేర్కొన్నారు. అలాగే ఋషి కొండపై కొండలను చూసి మేము ఆశ్చర్య పడటం లేదని.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎవ్వరికీ ఉపయోగ పడకుండా జగన్ కోసం భవంతులు కట్టారని విమర్శించారు. ఆ డబ్బు ప్రజాశ్రేయస్సు కోసం, సీసీ కెమెరాలు ఉపయోగించి ఉంటే రాష్ట్రంలో గత ఐదేళ్ళ అరాచకాలు తగ్గేవిని అన్నారు. 

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

రోజా నోటికి అడ్డు ఉండదు

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

అదే సమయంలో రోజాపై సైతం తీవ్ర విమర్శలు చేశారు. రోజా నోటికి అడ్డు అదుపు ఉండదని విమర్శించారు. నెలకు రెండు పూటలు ఏపీలో ఉంటే మిగతా రోజులు తమిళనాడు, కర్ణాటక, ప్రాన్స్‌లో ఉన్న ఆమెకు ప్రజల కష్టాలు తెలియవని మండిపడ్డారు. విజయవాడ వరదల్లో వారు ఏ మేరకు కష్టపడ్డారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని అన్నారు. రోజాకు ఏమైనా అనుమానం ఉంటే గౌండ్ లెవల్ పరిశీలనలు చేసుకోవచ్చని.. దీనికోసం డిజాస్టర్ మీనేజ్ మెంట్ అధికారిని పంపుతానని పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! 

రోజా ఆర్టీఐ యాక్ట్ ద్వారా వివరాలు తెచ్చుకుని మాట్లాడితే మంచిదని అన్నారు. రెడ్ బుక్‌లో తమ పేర్లు ఉన్నాయన్న భ్రమలో వైకాపా నాయకులు భుజాలు తడుముకుంటున్నారన్నారు. ఇక చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు