Ap Govt : ఏపీ మహిళలకు శుభవార్త..ఆ పథకం తిరిగి ప్రారంభం!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది.

New Update
Chandrababu Naidu: పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

Ap Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ సర్కార్ పథకాన్నిమరోసారి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని మరోసారి పునరుద్దరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

Also Read: ఉదయం లేవగానే ఈ వస్తువులను చూశారంటే.. శని మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది!

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 లో  ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం రూ.800 విలువైన పౌడర్, లోషన్, న్యాప్‌కిన్‌ , స్లిపింగ్‌ బెడ్, , డైపర్స్, దుప్పటి, దోమతెర ‌తో పాటు చిన్నపిల్లల సబ్బులను జిప్‌ బ్యాగ్‌లో ఉంచి బాలింతలకు అందించేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ తీసుకురావాలని అనుకుంటుంది. ఈ మేరకు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్‌, తెలంగాణ, ఒడిశా, లో అమలవుతున్న ఈ తరహా పథకాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి కనీసం రూ.1,200 నుంచి రూ.1,300 వరకు ఖర్చు చేస్తున్నారు. 

Also Read: టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా!

రూ.5 వేలు...

అంతేకాదు రాష్ట్రంలో ‘ఆసరా’ కింద బాలింతలకు ప్రస్తుతం రూ.5 వేలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణకు ఏపీప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 31లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అయితే దూరాన్నిబట్టి ఒకేరోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు సభలను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల్లో రీ-సర్వేపై అవగాహన కల్పించాలని రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Also Read:  గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అందుకు తగిన విధంగా నిర్వహించే గ్రామసభల్లో అన్ని రకాల భూసమస్యలపై.. రైతుల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. రైతులెవరైనా రీ-సర్వేతో నష్టపోయినట్లు ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు చర్యలు తీసుకుంటారు.

Also Read: క్రైమ్ ప్రపంచానికి రారాజు.. లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రస్థానమిదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు