Vastu Shastra : ఉదయం లేవగానే ఈ వస్తువులను చూశారంటే.. శని మీ చుట్టూ వైఫైలా తిరుగుతుంది!

వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే కొన్ని వస్తువులను చూడడం అశుభంగా భావిస్తారు. ఆగిపోయిన గడియారం, విరిగిన దేవుడి పటాలు, మురికి పాత్రలను చూడకూడదని చెబుతారు. విశ్వాసాల ప్రకారం, అరచేతులలో లక్ష్మీ దేవి నివసిస్తుంది. అందుకే లేవగానే అరచేతులను చూడడం మంచిది.

New Update
wakeup 1

wakeup

Life Style : హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని వస్తువులను చూడడం అశుభంగా భావిస్తారు. దీని కారణంగా వ్యక్తి ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది. అందుకే పెద్దలు ఉదయం లేవగానే అరచేతులను చూడాలని చెబుతారు. విశ్వాసాల ప్రకారం అరచేతిలో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్మకం. అందుకే లేవగానే అరచేతులను చూసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అసలు ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడని వస్తువులు ఏంటి? దీనికి కారణమేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read:  PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!

నిద్రలేవగానే చూడకూడని వస్తువులు 

ఆగిపోయిన గడియారం

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఆగిపోయిన, పాడైపోయిన గడియారాన్ని ఉంచకూడదు. దీనిని అశుభంగా భావిస్తారు. ఉదయం లేవగానే ఆగిపోయిన గడియారాన్ని చూడడం..  జీవితంలో ఏదైనా సమస్య రాబోతోందనడానికి సంకేతంగా చెబుతారు. 

నీడ 

నిద్రలేచిన వెంటనే నీడ వైపు చూడకూడదు. అది మీ సొంత నీడైనా సరే చూడకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, కళ్ళు తెరిచిన వెంటనే నీడని చూడడం అశుభంగా చెబుతారు. నీడ..  మరణం, తిరస్కరణ, ద్వేషం లేదా చీకటితో సంబంధం కలిగి ఉంటుంది.

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!

మురికి పాత్రలు 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్ర లేవగానే మురికి పాత్రలు చూడకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని కలిగిస్తుంది. సంబంధాలలో చీలికలు తెచ్చి ఒత్తిడికి గురిచేస్తుంది. అంతేకాదు ఉదయాన్నే వీటిని చూడడం పేదరికానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత పాత్రలను శుభ్రంగా కడిగి పెట్టాలి. 

wakeup 22

పగిలిన అద్దం

ఉదయం నిద్రలేచిన వెంటనే పగిలిన అద్దాన్ని చూడడం అశుభాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. చేసే పనికి ఆటంకం కలుగుతుందని చెబుతారు. 

విరిగిన విగ్రహం

విరిగిన దేవతా విగ్రహాన్ని ఇంట్లో, పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. వీటి వల్ల జీవితంలో ప్రతికూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు విరిగిన దేవుడి పటాలు అలాగే ఇంట్లో పెట్టుకోవడం వల్ల జీవితంలో కష్టాలు కూడా పెరుగుతాయట.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. డార్లింగ్ మొదటి సినిమా రీరిలీజ్

ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

Advertisment
తాజా కథనాలు