ఏపీ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2 లక్షల 94 వేల 427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయించగా.. అందులో మహిళా, శిశు సంక్షేమ శాఖకు దాదాపు రూ.4,285 కోట్లను కేటాయించారు. ఆ కేటాయింపులో డ్వాక్రా మహిళలకు చేయూతలో భాగంగా సున్నావడ్డీ పథకం అమలు కోసం నిధులు కేటాయించారు.
Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామి ఇచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ పథకాన్ని రూ.10 లక్షల వరకు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇచ్చిన హామి మేరకు తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో ప్రభుత్వం నిధులు కేటాయించింది.
Also Read: Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం
పథకం కోసం రూ.1,250 కోట్లు
ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు చేయుత అందించేందుకు సున్నా వడ్డీ పథకం కోసం రూ.1,250 కోట్లు కేటాయించారు. అందులో పట్టణ ప్రాంతాల్లో రూ.300 కోట్లు.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.950 కోట్లను కేటాయించారు.
Also Read: నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్
డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షలు వరకు రుణం
ఈ మేరకు సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షలు వరకు రుణం అమలు చేయనుంది. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ పథకం కింద రూ.5 లక్షలు వరకు వర్తింపచేసింది.
Also Read: వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ
ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రూ.3 లక్షలకు తగ్గించిందనే విమర్శలు సైతం వచ్చాయి. దీంతో ఈ విషయం పై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడు అడుగులు ముందుకు వేస్తోంది.