AP News: పెన్నా నదికి గోదావరి జలాలు తరలించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కృష్ణా నది మీదుగా గోదావరి, పెన్నా జలాలను కలిపే ప్రక్రియపై అధికారులతో చర్చలు జరుపుతోంది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఆగిపోయిన ఈ మూడు నదుల అనుసంధాన ప్రక్రియను.. ఆర్థిక సమస్యలున్నా పట్టా లెక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
ఈ జిల్లాలను సస్యశామలం చేసేందుకే..
ఈ ప్రాజెక్టులో ముందుగా పోలవరం కుడి కాలువ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి తరలిస్తారు. వైకుంఠపురం నుంచి కొత్త కాలువల ద్వారా గుంటూరులోని బొల్లాపల్లికి పంపిస్తారు. అక్కడ రిజర్వాయర్ నిర్మించిన తర్వాత నల్లమల మీదుగా ప్రకాశం బనకచర్లకు తరలిస్తారు. తర్వాత సోమశిల, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవాకు జలాలను పంపించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశామలం చేయాలని చంద్రబాబు సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు టీడీపీ ప్రభుత్వంలోనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టింది. ప్రస్తుత ఆ కాలువ సామర్థ్యాన్ని బట్టి కృష్ణా డెల్టాకు 17,561 క్యూసెక్కుల నీటిని తరలింవచ్చనే అంచనాకు వచ్చారు.
రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు తరలింపు..
ఇక కాలువలను తవ్వడం ద్వారా మరింత విస్తీర్ణం పెరగనుంది. దీంతో గోదావరి మిగులు జలాలను వీలైనంత వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు తరలించవచ్చని జల వనరుల శాఖ అంచనా వేసింది. గోదావరి జలాలను కాలువల ద్వారా 121 రోజుల్లో 75.1 టీఎంసీలను ఎత్తిపోయవచ్చని అంచనా వేసింది. 117 రోజుల పాటు 11,583 క్యూసెక్కుల ప్రవాహంతో 122.7 టీఎంసీలను తరలించవచ్చని పేర్కొంది. 116 రోజుల్లో 14,126 క్యూసెక్కుల ప్రవాహంతో 148.8 టీఎంసీలను తలరించవచ్చని తెలిపింది. 111 రోజుల్లో 17,657 క్యూసెక్కులతో 184.5 టీఎంసీలను, 107 రోజుల పాటు 21,188 క్యూసెక్కులతో 215 టీఎంసీలను, 105 రోజుల పాటు 23,166 క్యూసెక్కులతో 231.4 టీఎంసీలను, 104 రోజుల్లో 24,720 క్యూసెక్కులతో 244 టీఎంసీలను తరలించే వీలుందని జల వనరుల శాఖ సీఎం చంద్రబాబుకు వివరించింది.
ఇది కూడా చదవండి: Pushpa 2 : 'పుష్ప 2' కోసం రంగంలోకి రాజమౌళి.. సుకుమార్ ప్లాన్ అదుర్స్
10,000 ఎకరాల మేర భూసేకరణ..
ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల 22 టీఎంసీలను వెలిగొండ ప్రాజెక్టుకు సరఫరా చేయవచ్చని జల వణరుల శాఖ చెబుతోంది. ఇక బనకచర్ల కాంప్లెక్స్ నుంచి తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు 140 టీఎంసీలను తరలించవచ్చని అంచనా వేసింది. ‘బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు 180 టీఎంసీల గోదావరి జలాలను తరలించే వీలుంది. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా కొత్త కాలువను తవ్వి గోదావరి జలాలను తరలించే మరో ప్రతిపాదననూ జల వనరుల శాఖ పరిశీలించింది. గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తులో ఉన్న కృష్ణాకు ఎత్తిపోయడం వల్ల చివరి ప్రాంతానికి జలాలు వేగంగా ప్రవహించే వీలుందని చెప్పింది. ఈ కాలువ తవ్వకానికి 10,000 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి వస్తుందని, కానీ భూమి సేకరించడం కష్టసాధ్యమైన పనిగా పేర్కొంది. చివరగా పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి, వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నుంచి బొల్లాపల్లి రిజర్వాయరు, అక్కడినుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది జల వనరుల శాఖ.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ?