Pushpa 2 : 'పుష్ప 2' కోసం రంగంలోకి రాజమౌళి.. సుకుమార్ ప్లాన్ అదుర్స్

'పుష్ప 2' ప్రమోషన్లలో డైరెక్టర్ రాజమౌళి కూడా భాగం కానున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్ లతో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నారట. సుమారు గంట పాటూ ఈ ఇంటర్వ్యూ ఉండబోతుందని సమాచారం.

New Update
asdcxv

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప ది రూల్' రిలీజ్ టైం దగ్గర పడుతోంది. డిసెంబర్ 5 న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. అంటే సినిమా విడుదలకు కేవలం 20 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ దేశ వ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ఈ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. నవంబర్ 17 న పాట్నాలో 'పుష్ప2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. 

అక్కడి నుంచి మూవీ టీమ్ బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలు, టాక్ షోస్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'పుష్ప2' కోసం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిని రంగంలోకి దింపుతున్నారట మేకర్స్. 'పుష్ప 2' ప్రమోషన్లలో డైరెక్టర్ రాజమౌళి కూడా భాగం కానున్నట్లు సమాచారం. పుష్ప 2 మూవీ టీంతో జక్కన్న స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నారట.

Also Read : తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు..హైకోర్ట్ కీలక నిర్ణయం, నటి కస్తూరి అరెస్ట్?

రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ..

'పుష్ప పార్ట్ 1' ప్రమోషన్స్ లోనూ రాజమౌళి భాగస్వామి అయ్యారు. ఇప్పుడు మరోసారి సెకండ్ పార్ట్ కోసం జక్కన్నను రంగంలోకి దించేందుకు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్ లతో ను రాజమౌళి హోస్ట్ గా ఇంటర్వ్యూ చేయనున్నారని, సుమారు గంట పాటూ ఈ ఇంటర్వ్యూ ఉండబోతుందని సమాచారం. 

అంతేకాదు ఇందులో 'పుష్ప 2' తో పాటూ 'SSMB29' ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని విషయాలను జక్కన్న షేర్ చేసుకోనున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఇదే కనుక నిజమైతే రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూతో 'పుష్ప 2' కు మరింత హైప్ రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. 

Also Read : ఆమీర్ ఖాన్ తో దిల్ రాజు సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు