AP Education : విద్యా విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు బేసిక్ ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాలలుగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన డైరెక్టర్ విజయరామరాజు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే ఇందుకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు.
Also Read : పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో పనివేళల్లో మార్పులు
ప్రతి పంచాయతీకి ఒక ఆదర్శ పాఠశాల..
ఈ మేరకు బేసిక్ స్కూళ్లో 20 మందిలోపు పిల్లలకు ప్రభుత్వం ఒక ఎస్జీటీ టీచర్ ను నియమించనుంది. 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను కేటాయించనుంది. 30మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీ పోస్టు నియమించనుంది. ఇక ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎస్జీటీని ఇవ్వనుండగా..120 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు 1:30, ఉన్నత పాఠశాలలకు 1:35 నిష్పత్తిలో టీచర్లను కేటాయిస్తుంది. ఇక ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ఆదర్శ పాఠశాలను ఏర్పాటుచేయాలనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్స్, బదిలీలు..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలల విధానం పూర్తిగా రద్దు చేయనుంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో 30మంది కంటే తక్కువ ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా, 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలలుగా మార్చనుంది. పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను మెరిట్ కం రోస్టర్ విధానంలో తయారు చేస్తుండగా షెడ్యూల్ ప్రకారం ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ చేయనుంది.
ఇది కూడా చదవండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం..
ప్రతి సంవత్సరం మే 31నాటికి ఖాళీల బదిలీలు చేస్తోంది. జూన్ 1న పాఠశాలల్లో చేరేలా ఉత్తర్వులు ఇస్తోంది. అలాగే బదీలలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్లు, ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా 8ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంటుంది. హెచ్‌ఆర్‌ఏ 16% ఉన్న వాటిని కేటగిరి-ఎ, 12% వాటిని కేటగిరి-బి, 10% ఉంటే కేటగిరి-సి, 5వేల కంటే జనాభా తక్కువగా ఉంటే కేటగిరి-డీగా పేర్కొంటుంది. బదిలీల సమయంలో కేటగిరి-ఏకు 1 పాయింట్, కేటగిరి- Bకి 2, కేటగిరి C కి 3 పాయింట్లు, కేటగిరి-Dకి 4పాయింట్లను కేటాయిస్తుంది. అలాగే ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఎస్జీటీలకు మే ఒకటి నుంచి 10 వరకు ఉంటాయి. పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు రిలీజ్ చేస్తారు. పదోన్నతులు, బదిలీలు పూర్తికాగానే డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను మే 11 నుంచి 30 వరకు విధుల్లోకి తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 60 రోజుల్లో నివేదిక!
జీఓ-117 రద్దు..
ఇందులో భాగంగానే డిసెంబరు 5న టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో టీచర్ల బదిలీల చట్టం ముసాయిదాపై డిసెంబరులోనే మంత్రి లోకేశ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీఓ-117 రద్దు, బదిలీల చట్టంపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి డైరెక్టరేట్ నుంచి పంపించనున్నారు. ఇక పదోన్నతులకు సంబంధించి మొదటి విడతగా డిసెంబరు 20 వరకు ఉపాధ్యాయుల ప్రొఫైల్ నవీకరిస్తారు. రెండో విడత జనవరి 20, మూడో విడత ఫిబ్రవరి 10 వరకు అవకాశం కల్పిస్తారు. ఈ టీచర్ ప్రొఫైల్స్‌ను అనుసరించే సీనియారిటీ జాబితా రెడీ అవుతోంది. సమ్మెటివ్ పరీక్షలు డిసెంబరు 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు.
Also Read : వైసీపీకి భారీ షాక్.. 11మంది రాజీనామా!