BIG BREAKING: వైసీపీకి భారీ షాక్.. 11మంది రాజీనామా! AP: వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్లో వైసీపీకి 27 మంది సభ్యుల బలం ఉండగా.. వీరి రాజీనామాతో 16కు పడిపోయింది. By V.J Reddy 16 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి YSRCP: వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్లో వైసీపీకి 27 మంది సభ్యుల బలం ఉంది. 11 మంది సభ్యుల రాజీనామాతో వైసీపీ బలం 16 కు పడిపోయింది. రాజీనామా చేసిన వారిలో ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీపై వైసీపీ పట్టు కోల్పోయింది. త్వరలో మరి కొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే నిడదవోలులో వైసీపీ ఖాళీ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిడదవోలులో ప్రస్తుతం జనసేన పార్టీ చక్రం తిప్పుతోంది. రాజీనామా చేసిన వారు త్వరలో జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల హిందూపురం... మాజీ సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. తన ఇలాఖా లో మరో అంకానికి తెర లేపారు. ప్రభుత్వం మారాక చైర్ పర్సన్ ఇంద్రజ తో సహా 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఉన్న టీడీపీ కౌన్సిలర్లతో సహా ప్రస్తుతం 22 మంది కౌన్సిలర్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి. 22 మంది కౌన్సిలర్లను ప్రత్యేక బస్ లో హైదరాబాద్ కు నందమూరి బాలకృష్ణ తరలించి.. ప్రైవేట్ రిసార్ట్ లో కౌన్సిలర్లు మకాం వేశారు. హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులకు 30 కౌన్సిలర్లను వైసీపీ గెలవగా.. టీడీపీ - 6, ఇతరులు ఇద్దరు గెలిచారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి