Pawan Kalyan: జనసైనికులకు పవన్ కీలక పిలుపు.. ఆ రక్షణే ధ్యేయంగా పోరాటం!

ఏపీ ప్రజలు, జన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. ప్రకృతిలో అత్యంత విలువైన, ఏపీలో ఉన్న 25,000 పైగా చిత్తడి నేలలను కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. మన అందరి బాధ్యత అన్నారు.

New Update
pawan kalyan

AP deputy cm Pawan Kalyan

Pawan Kalyan: జన సైనికులు, ఏపీ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. 'ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం' సందర్భంగా ఆసక్తికర పోస్ట్ పెట్టాన ఆయన.. పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలని అవసరం ఉందన్నారు. ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో చిత్తడి భూములు ప్రధానమైనవన్నారు. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలుగానే కాదు కార్బన్ నిల్వ కేంద్రాలు, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అసాధారణమైన ప్రదేశాలని కొనియాడారు. 

ఇది అతి పెద్ద మంచి నీటి సరస్సు..

ఈ భూములు భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాతావరణ మార్పులను నియంత్రించడంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఉత్తమంగా పనిచేస్తాయి. ఏపీలో 25,000 పైగా చిత్తడి నేలలు ఉన్నాయి. ప్రముఖమైనది కొల్లేరు సరస్సు. ఇది రామ్‌సర్ సైట్‌గా గుర్తింపు పొందిన భారతదేశంలోని అతి పెద్ద మంచి నీటి సరస్సులో ఒకటి. దేశంలో రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సైన పులికాట్ సరస్సు. సముద్ర జీవజాలానికి కీలకమైన ఉప్పుటేరు వాతావరణ వ్యవస్థ కూడా ఉన్నాయని చెప్పారు. 

ఇది కూడా చదవండి: ఆకాశం నుంచి సాలెపురుగుల వర్షం.. ఎక్కడంటే?

ఈ భూములు పక్షుల సంరక్షణకు, మత్స్య సంపదతోపాటు వ్యవసాయానికి ఉపయోగపడుతూ వేలాది మంది ప్రజలకు జీవనాధారం అందిస్తున్నాయని అన్నారు. వనరులను రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను కచ్చితంగా నిర్ధారించేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. మన అందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు