CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కొత్తింటికి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు భార్య, కుమారుడు లోకేష్ దంపతులుతో గృహ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

New Update
Chandrababu Kuppam House opening ceremony

Chandrababu Kuppam House opening ceremony

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కొత్తింటికి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు భార్య, కుమారుడు లోకేష్ దంపతులుతో గృహ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే చంద్రబాబు నాయుడు వారి జిల్లా ప్రజల కోసం మంచి విందును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

కల్మషం లేని మనుషుల మధ్య..

గృహ ప్రవేశం జరిగిన తర్వాత నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ... మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది. 

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

కల్మషం లేని మంచి మనుషుల మధ్య...మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకు ఎన్నటికీ గుర్తుండిపోతుంది. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు