AP Weather: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో జాగ్రత్త

ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటుగా వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

New Update
Telangana Weather Update: మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త!

ఏపీలో ఎండలు (Sun), వేడిగాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నట్లు తెలుస్తుంది.  అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం.. ఏలూరు జిల్లా వేలేరుపాడు.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట.. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హీర, లక్ష్మీనర్సుపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Also Read: Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!

మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 62 ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా-11, విజయనగరం-16, పార్వతీపురం మన్యం-10, అల్లూరి సీతారామరాజు -10, అనకాపల్లి-2, కాకినాడ-1, కోనసీమ-1, తూర్పుగోదావరి-8, ఏలూరు-3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపుతాయని తెలిపారు. సోమవారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 38.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లా గుడిపాలలో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Also Read:  Boat Accident: పడవ బోల్తా పడి 25 మంది మృతి..వారిలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు  కూడా!

AP Weather Report

కోస్తాతో పాటుగా రాయలసీమ (Rayalaseema) లో కూడా ఎండలు మండుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో వేడి గాలుల ప్రభావం ఇంకా లేదు.. మార్చిలో వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని జాగ్రత్తలు అవసరం అంటున్నారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఎండ ఇలా ఉంటే ఇక ఏప్రిల్‌-మే నెలల్లో పరిస్థితేంటి అని జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

గతంలో కంటే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిదని.. వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎండాకాలం కాబట్టి తగినంత నీరు తాగుతుండాలని.. చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచనలు చేస్తున్నారు. 

ఒకవేళ వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని.. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మొత్తం మీద ఏపీలో ఎండల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు.

Also Read:Gold: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చో తెలుసా ?

Also Read: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు