/rtv/media/media_files/2025/01/31/keU9q4ZqDaiuSrNYbPgD.jpg)
Swiggy and zomato Boycott in Andhra Pradesh
ఏపీలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను బహిష్కరించాలని గతంలో హోటళ్ల యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నగదు చెల్లింపులు చేయకుండా స్విగ్గీ ఇబ్బంది పెడుతున్నందని ఆరోపిస్తూ హోటల్, రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో స్విగ్గీ అమ్మకాలు నిలిపివేయాలని హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ, జొమాటో వల్ల రెస్టారెంట్లు, హోటళ్లకు నష్టం కలుగుతోందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం
అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ హోటళ్ల సంఘ (ఏపీహెచ్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.స్వామి స్పందించారు. రాష్ట్రంలోని హోటళ్లలో జొమాటో, స్విగ్గీ ఆర్డర్లను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై మరో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా హోటళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడలో ఏపీహెచ్‌ఏ కార్యనిర్వాహక కమిటీ రెండోరోజు ఆయన పాల్గొని మాట్లాడారు.
Also Read : ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
జొమాటో, స్విగ్గీ ఆర్డర్లను గతంలో బహిష్కరించామని అన్నారు. అయితే దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీ వేశామని తెలిపారు. ఈ అంశం మీద విజయవాడలోని అన్ని జిల్లాల అధ్యక్షులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
అంతేకాకుండా హోటల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరపకుండా వారికి నచ్చిన ధరలు (అధిక ధరలు) నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక హోటల్ యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే.. ఏపీహెచ్‌ఏ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు ఫుడ్ డెలివరీకి కొత్త కొత్త యాప్‌లు వచ్చాయని గుర్తు చేశారు.
Also Read : చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL