Singayya Incident: నా భర్తను ఏదో చేశారు.. సింగయ్య మృతిపై భార్య సంచలన ఆరోపణలు!

సింగయ్య మృతిపై ఆయన సతీమణి లూర్దుమేరి సంచలన కామెంట్స్ చేశారు. తన భర్తను అంబులెన్సులో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదన్నారు. లోకేష్ మనుషులు 50 మంది వచ్చి.. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు.

New Update
YS Jagan

Singayya Incident

Singayya Incident: ఇటీవల జగన్(YS Jagan) టూర్లో వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన సతీమణి లూర్దుమేరి సంచలన కామెంట్స్ చేశారు. తన భర్తను అంబులెన్సులో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదన్నారు. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. ఆయనను ఏదో చేశారని తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారన్నారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు.

Also Read: సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్‌ వైపు వెళ్లి.....

Also Read: మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

జగన్ అంటే ఇష్టం..

తాము కూడా మీ కులస్తుల మంటూ చెప్పారని వివరించారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారని ఫైర్ అయ్యారు. తాను అందుకు అంగీకరించలేదని బెదిరించారు. పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారన్నారు. మా మీద రకరకాలుగా ఒత్తిడి చేశారన్నారు. తమ కుటుంబానికి జగన్ అంటే ఇష్టమన్నారు. అందుకే ఆయనను కలిశామన్నారు. తమ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. 

Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు