మందు బాబులకు బిగ్ షాక్.. త్వరలో పెరగనున్న మద్యం ధరలు

ఏపీలో మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ సరిపోకపోవడం వల్ల ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ధరలు పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం చెల్లిస్తున్న కమిషన్‌ను 14.5 శాతానికి పెంచాలని భావిస్తోంది.

New Update
Wine Shops : మందుబాబులకు షాక్.. రేపు వైన్స్‌ షాపులు బంద్‌

wine shops

ఏపీలో మద్యం ధరలు పెరగనున్నాయి. వీటి ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న వారికి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు. మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ సరిపోవడం లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం చెల్లిస్తున్న కమిషన్‌ను 14.5 శాతానికి పెంచాలని భావిస్తోంది. ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటు వల్ల ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.

ఇది కూడా చూడండి: దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?

కొత్త పాలసీని తీసుకొచ్చి..

గతేడాది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇచ్చే మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని భావించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏపీలో 3వేలకు పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే

ఇదిలా ఉండగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధమైంది. 2019 నుంచి 2024 మధ్య మద్యం అక్రమాలపై విచారణకు సిట్  బృందం ఏర్పాటురు ఉత్తర్వులు జారీ చేసింది.  విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ దర్యాప్తు సహకరించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు చేసింది. 

ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు