/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
Jagan
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా నర్సీపట్నంలో జగన్ టూర్ కాస్త టెన్షన్‌గా ఉంది. అయితే ముందుగా జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత 18 షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చారు. రూల్స్ అతిక్రమించే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీజీపీకు జగన్ హెచ్చరించారు. అలాగే పర్యటన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తాము నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే మార్గంలో వెళ్లినా, నిబంధనలను ఉల్లంఘించినట్టుగా పరిగణించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: TDP leaders suspend: కల్తీ లిక్కర్ స్కాంలో TDP లీడర్ల సస్పెండ్
పర్యటన సందర్భంగా భారీగా జనసమీకరణ చేసినా, ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించినా అనుమతించమని పోలీసులు హెచ్చరించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రాజకీయ హోదా, పార్టీతో సంబంధం లేకుండా చర్యలు ఉంటాయని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. జగన్ వెళ్లే మార్గంలో ఊరేగింపులు, ర్యాలీలకు పోలీసులు ఏమాత్రం అనుమతి ఇవ్వలేదు. ప్రజలు రోడ్ల పక్కన నిలబడి మాత్రమే తమ అభిమానాన్ని, మద్దతును చూపాలని తెలిపారు. అలాగే జగన్ కాన్వాయ్‌లో కేవలం 10 వాహనాలకే మాత్రమే అనుమతిని ఇచ్చారు. మిగతా వాహనాలను పక్కకు పెట్టాలని ఆదేశించారు. ఈ నిబంధనలన్ని పర్యటన సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే అని పోలీసులు చెబుతున్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటన ముఖ్య ఉద్దేశం.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయడమే. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం పేద విద్యార్థులకు, ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. అందుకే నర్సీపట్నంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకున్నప్పటికీ, పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆయన తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చూడండి: Mohan Babu: మోహన్‌బాబుకు బిగ్ షాక్... విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా