Kanipakam: కాణిపాకంలో అపచారం..ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు

కాణిపాకంశ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్‌.సోమశేఖర్‌ గురుకుల్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఈవో పి.గురుప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
giru

Kanipakam Temple: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఈ మేరకు ఆలయ అర్చకుడు ఎన్‌.సోమశేఖర్‌ గురుకుల్‌‌ను సస్పెండ్ చేశారు.

Also Read: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం

సోమశేఖర్‌ అర్చకుడిగా ఉద్యోగం పొందే సమయంలో సరైన ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఉద్యోగం పొందడం.. తదనంతరం పదోన్నతులు పొందడంపై ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపారు.

Also Read:  పోలీసులు ఖాకీ రంగు యూనిఫామ్‌ ఎందుకు వేసుకుంటారు?

విచారణలో పలు ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఈవో పి.గురుప్రసాద్‌ వెల్లడించారు. ఆలయంలో ప్రస్తుతం ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌.ఎస్‌.గణేశ్‌ గురుకుల్‌ను ఇన్‌ఛార్జి ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:  ఆగని బాంబు బెదిరింపులు..ఈరోజు 32 ఎయిర్ ఇండియా విమానాలకు

 ఇదే తొలిసారి...

కాణిపాకం ఆలయంలో ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఆయనపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఈవోను ఆదేశించారు.

Also Read:  మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

 వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పాలక మండలి సిఫార్సులో సోమశేఖర్ గురుకుల్ తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడైంది.

Also Read:  ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు

దీంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ సోమవారం ఈవో ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అప్పటి పాలకమండలి అర్హతలేని 24 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఈవో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Also Read:  ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. 'RT75' నుంచి మాస్ అప్డేట్

Advertisment
Advertisment
తాజా కథనాలు