AP News: ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం రేట్లు మరింత తగ్గించే ఆలోచన చేస్తున్నామన్న ఆయన జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నట్లు తెలిపారు. By Bhavana 30 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP: ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారు . అలాగే మద్యం ధరల తగ్గించే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నట్లు వివరించారు. Also Read: ఏపీ మంత్రి సుభాష్ కు తప్పిన పెను ప్రమాదం! పబ్‌లో మద్యం అమ్మితే... రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీపీఎస్ పెట్టి సరుకు పంపుతున్నుట్లు.. మద్యం ధరలు తగ్గించి త్వరలోనే వాటిని అమలు లోకి తీసుకుని వస్తామన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా పబ్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని.. కొత్త బ్రాండ్ల అమ్మకాలు త్వరలో తీసుకుని వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. Also Read: ఆగని బాంబు బెదిరింపులు..ఈరోజు 32 ఎయిర్ ఇండియా విమానాలకు గత వైసీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని మంత్రి రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వంలో సొంత ఆదాయం కోసం ఆలోచన చేశారే కానీ.. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. గత ప్రభుత్వం డిస్టిలరీ, తయారీ సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు. గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖలోని అక్రమాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. Also Read: హరియాణా ఎన్నికలు..కాంగ్రెస్ ఆరోపణలు నిజం కావు–ఈసీ ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశామని.. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడలేదన్నారు. మూడు వేల షాపులకు, 90 వేల అప్లికేషన్స్ రాగా.. రూ.1800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో మద్యం బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి హెచ్చరించారు. బెల్ట్ షాపును గుర్తిస్తే వారికి మద్యం సరఫరా చేసిన షాపు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అంతేకాదు మద్యం షాపుల్లో ఎంఆర్‌పీకే విక్రయాలు జరగాలన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. Also Read: వృద్ధులకు రూ.5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్-దీపావళికి ప్రధాని గిఫ్ట్ విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో ఎక్సైజ్ ల్యాబ్‌ను మంత్రి, ఎంపీ భరత్ తో కలిసి సందర్శించారు. ల్యాబ్‌లో పరీక్షలపై అడిగి తెలుసుకుని.. ఏయూ వర్సిటీ ల్యాబ్‌లో 9రకాల పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. మద్యంలో ఎలాంటి ప్రాణాంతక రసాయనాలు లేకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి