ఏపీ ప్రజలకు షాక్.. మరోసారి పెరగనున్న విద్యుత్ ఛార్జీలు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా విద్యుత్ ధరలు పెంచడం రెండోసారి. డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
CURRENTT

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్‌ ఛార్జీలు(AP Electricity Charges) పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా విద్యుత్ ధరలు పెంచడం రెండోసారి. డిస్కంల ప్రతిపాదనలకు  విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ నెల నుంచి వినియోగదారుల పైన రూ.9,412 కోట్ల వరకు భారం పడనుంది. సర్దుబాటు ఛార్జీలను యూనిట్‌కు 92 పైసలు చొప్పున 2026 నవంబర్ వరకూ వసూలు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది.    

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !

ఇదిలాఉండగా ఇప్పటికే ట్రూ అప్‌తో పాటు రెండు ఫ్యూయల్ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్‌ (FPPCA) ఛార్జీలు పెంచిన విద్యుత్ సంస్థలు మరోసారి భారం మోపడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.12,844 కోట్లు సర్దుబాటు చేసేందుకు ఈఆర్‌సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. 

ఇది కూడా చదవండి: ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి

ఇందులో రూ.3,432 కోట్లకు ఈఆర్‌సీ కోత విధించింది. మిగిలిన రూ.7,912 కోట్లు (వ్యవసాయ సబ్సిడీ రూ.1500 కోట్లు పోగా) ప్రజల నుంచి వసూలు చేయడం కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా పర్మిషన్ రావడంతో ఈ సర్దుబాటు ఛార్జీలను యూనిట్‌కు 92 పైసల చొప్పున డిసెంబర్‌ నుంచి 2026 నవంబర్ వరకూ వసూలు చేయాలని డిస్కంలకు సూచనలు చేసింది. ఈఆర్సీ పర్మిషన్ మేరకు డిస్కంలు ప్రతీనెల 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశాయి. 

ఇది కూడా చదవండి: అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా?

ఇది కూడా చదవండి: దామగుండం అడవిలో అగ్నిప్రమాదం.. అధికారులా పనేనా !

Advertisment
తాజా కథనాలు