/rtv/media/media_files/2025/02/01/573G6xQjGeRN27lnaj3h.jpg)
cm chandrababu naidu Prajagalam Sabha at annamayya district rayachoti
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించారు. సంబేపల్లి మండలంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఓ వృద్ధురాలికి పింఛన్ అందించారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీలు తీసుకొస్తాం
అనంతరం ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతక ముందు యువకులు చేస్తున్న ఉద్యోగాలు.. వారి అభిప్రాయాల గురించి తెలుసుకున్నారు. ఆపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకొస్తామన్నారు. అంతేకాకుండా మరెన్నో కంపెనీలకు శ్రీకారం చుడతామని అన్నారు.
చంద్రబాబుకు నిరసన సెగ
ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని.. ఇప్పుడు అమరావతికి శ్రీకారం చుట్టానన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని చూస్తే.. మోస్ట్ గ్లోబల్ సిటీగా ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆయన మట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి మధ్యలో అరిచాడు. అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని కొందరు నినాదాలు చేశారు.
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
రాయచోటి ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడుకు నిరసన సెగ
— RTV (@RTVnewsnetwork) February 1, 2025
అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని నినాదాలు చేసిన యువకుడిపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు@ncbn@JaiTDP#AndhraPradesh#TDP#LatestNews#RTVpic.twitter.com/UCOrwKZR6t
దీంతో రాయచోటి ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడుకు నిరసన సెగ తగిలినట్లయింది. వెంటనే ఆ యువకుడిపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏయ్ కూర్చో అంటూ ఫైర్ అయ్యారు. ‘‘నువ్ చెప్తే యూనివర్సిటీ ప్రకటించరు’’ అని అన్నారు. కొంతమంది కుర్రాళ్లు ఉన్నారు.. వారు సభను చెడగొట్టడానికే ఉంటారని అన్నారు. వాళ్లకు ఇదే అని అంటూ మండిపడ్డారు. మనమేం చేయలేమని.. వాళ్ల విధానాలు కూడా ఇలానే ఉంటాయని అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.